రికార్డులు బ్రేక్.. డివిలియర్స్ను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్..

By :  Kiran
Update: 2023-11-12 11:32 GMT

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ రికార్డులు సృష్టించాడు. ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచే బౌలర్లకు చుక్కలు చూపించిన హిట్‌మ్యాన్‌.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ పలు రికార్డులు బ్రేక్‌ చేశాడు. అలవోకగా సిక్సర్లు బాదే రోహిత్‌.. ఈ రోజు మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాది ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ 2015లో 58 సిక్స్ లు కొట్టగా రోహిత్ ఈ ఏడాది 59 సిక్స్లతో ఆ రికార్డు బ్రేక్‌ చేశాడు.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు కొట్టిన హిట్‌మ్యాన్.. అకర్‌మన్‌ వేసిన ఏడో ఓవర్ లో తొలి సిక్సర్‌ కొట్టాడు. 2023లో రోహిత్‌కు ఇది 59వ సిక్సర్‌. అంతకుముందు ఈ రికార్డు డివిలియర్స్‌ పేరిట ఉండేది. 2015లో డివిలియర్స్ వన్డేల్లో 58 సిక్సర్లు బాదాడు. క్రిస్‌ గేల్‌ 2019లో 56 సిక్సర్లతో ఈ రికార్డుకు దగ్గరగా వచ్చినా దానిని బ్రేక్‌ చేయలేకపోయాడు. దీంతో పాటు వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును కూడా రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. మెగాటోర్నీలో రోహిత్ ఇప్పటి వరకు 24 సిక్సర్లు కొట్టాడు. ప్రపంచకప్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన సారథులలో ఇయాన్‌ మోర్గాన్‌ (2019లో 22), ఏబీ డివిలియర్స్‌ (2015లో 21), ఆరోన్‌ ఫించ్‌ (2019లో 18) లు తర్వాత జాబితాలో ఉన్నారు.

ఇక వన్డేల్లో ఓపెనర్‌గా 14వేల పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ దాటేశాడు. భారత్‌ తరఫున ఈ రికార్డును సాధించిన మూడో బ్యాటర్‌ గా నిలిచాడు. ఈ లిస్టులో 16,119 పరుగులతో వీరేంద్ర సెహ్వాగ్ అగ్రస్థానంలో ఉండగా.. సచిన్‌ 15,335 రన్స్‌తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు.

Tags:    

Similar News