Rohit Sharma World Record : ఆసీస్తో మ్యాచ్.. రోహిత్ వరల్డ్ రికార్డ్...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. స్వదేశంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 6సిక్సర్లు కొట్టిన హిట్‌మ్యాన్ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు (Rohit Sharma New World రికార్డు ) న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్టిల్ (256) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల సింహంగా అవతరించాడు.
అదేవిధంగా అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకూ రోహిత్ దగ్గరవుతున్నాడు. ఈ రికార్డుకు మరో 4 సిక్సర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (553) సిక్సర్లు కొట్టగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు. ఈ అంశంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. 476 సిక్సులతో షాహిద్ ఆఫ్రిది మూడో ప్లేస్లో ఉండగా.. మెక్ కల్లమ్ 398 సిక్సులతో నాలుగో ప్లేస్లో ఉన్నాడు. అయితే వీరిద్దరూ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఆ తర్వాతి ప్లేస్లో మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
మరోవైపు చివరి వన్డేలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 352 రన్స్ చేసింది. మిచెల్ మార్ష్ (96) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. డేవిడ్ వార్నర్ (56), స్టీవ్ స్మిత్ (74), లబుషేన్ (72) పరుగులతో రాణించారు. ఆ తర్వాత టీమిండియా 41 ఓవర్లలో 255 రన్స్ తో ఆడుతోంది. రవీంత్ర జడేజా, కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 81,
విరాట్ కోహ్లీ 56, శ్రేయస్ అయ్యర్ 48 రన్స్తో రాణించారు.