రోహిత్ శర్మకు ఘోర అవమానం.. జట్టులో చోటు కరువు!

Byline :  Bharath
Update: 2024-02-19 15:56 GMT

విజయవంతంగా 16 సీజన్లు పూర్తిచేసుకున్న ఐపీఎల్ టోర్నీ.. ఇప్పుడు 17వ సీజన్ లోకి అడుగుపెడుతుంది. ఈ పదహారేళ్లలో ఎన్ని విధ్వంసకర ఇన్నింగ్స్ లు, కోలుకోలేని పరాభవాలను చూశాం. ఎందరో కుర్రాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ముంబై ఇండియన్స్ 5, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు 5సార్లు చాంపియన్ గా నిలిచాయి. కాగా ముంబైకి 5 కప్పులు అందించిన రోహిత్ శర్మను బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్ గా పిలుస్తుంటారు. అయితే.. ఇప్పుడు ఐపీఎల్ ఆల్ టైం గ్రేటెస్ట్ కెప్టెన్ గా ధోనీ ఎంపికయ్యాడు. మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, డేల్ స్టెయిన్, మాథ్యూ హెడన్, టామ్ మూడీ తదితరులతో పాటు.. 70 మంది జర్నలిస్టులతో కూడిన నిపుణుల బృదం ఈ జట్టులను ప్రకటించింది. వారంతా ధోనీకే ఓటు వేశారు. దీంతో రోహిత్ శర్మకు ఘోర అవమానం అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

వీరంతా ప్రకటించిన జట్టులో టాపార్డర్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, టీమిండియా సూపర్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ, వెస్టిండీస్‌ పవర్‌ హౌజ్‌ క్రిస్‌ గేల్‌లకు చోటు దక్కింది. మిడిలార్డర్‌లో మిస్టర్ ఐపీఎల్ సురేశ్‌ రైనా, ఏబీ డివిలియర్స్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ధోనీలకు స్థానం సంపాదించారు. లోయర్ ఆర్డర్ లో హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్‌ పొలార్డ్‌ల పేర్లు ఖరారు చేశారు. రషిద్‌ ఖాన్‌, సునిల్‌ నరైన్‌, లసిత్‌ మలింగ, జస్‌ప్రీత్‌ బుమ్రా, యజువేంద్ర చహల్‌ బౌలింగ్‌ యూనిట్ లో చోటు సంపాదించారు. 

Tags:    

Similar News