WTC ఫైనల్ పోతే ఏంటి.. వరల్డ్ కప్లో చూసుకుంటాం: రోహిత్ శర్మ

Update: 2023-06-13 11:50 GMT

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయిన టీమిండియా.. అక్టోబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం అవుతోంది. భారత్ వేదికలపై జరిగే ఈ మెగా టోర్నీకి బీసీసీఐ ఇప్పటికే మూసాయిదా షెడ్యూల్ రెడీ చేసి.. ఐసీసీకి పాస్ చేసింది. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. గత పదేళ్లుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ దక్కించుకోలేదు. వరసగా రెండోసారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఓడిపోయింది. ఈ క్రమంలో సొంత గడ్డపై జరిగే వరల్డ్ కప్ నైనా టీమిండియా దక్కించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ ఓటమిపై మాట్లాడిన రోహిత్ శర్మ.. ఇవేవీ ప్రపంచకప్ లో టీమిండియా ప్రదర్శనపై ప్రభావం చూపవని తెలిపాడు. ‘అక్టోబర్ లో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం మేమంతా ఆత్రుతంగా ఎదురుచూస్తున్నాం. ఈ టోర్నీలో విభిన్నమైన ఆటతీరుతో బరిలోకి దిగుతాం. ప్రతీ గేమ్ ను ముఖ్యమైనదిగా భావిస్తాం. అన్నిట్లో విజయం సాధించాలని అనుకుంటాం. తప్పకుండా అభిమానుల్ని అలరించేందుకు ప్రయత్నిస్తాం. ఈ టోర్నీలో మా అత్యున్నత ఆటతీరును చూస్తారు. మా దృష్టంతా విభిన్నంగా ఆడి కప్ గెలవడంపైనే ఉంటుంది’అని రోహిత్ శర్మ అన్నాడు.

Tags:    

Similar News