IND vs SL: గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా అనడమే మీకు తెలుసు: రోహిత్ శర్మ

Byline :  Bharath
Update: 2023-11-02 08:18 GMT

ప్రపంచకప్ లో రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. బ్యాటింగ్ లో రాణిస్తూ.. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. టీమిండియా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లో గెలిచి సత్తాచాటుతుంది. దీంతో రోహిత్ కు ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. తాజాగా వాటిపై రోహిత్ స్పందించాడు. గెలిచినప్పుడు మంచి కెప్టెన్ అని.. ఒక్క మ్యాచ్ లో ఓడిపోగానే చెడ్డ కెప్టెన్ అని అనడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్.. అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. తాము మ్యాచ్ లో ఎలాంటి ప్రయత్నం చేసినా అది జట్టు ప్రయోజనాల కోసమే అని అన్నాడు. వరుస విజయాలు సాధించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఓడినప్పుడే చెడ్డ వాడినవుతానని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఫిట్ నెస్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు కాంబినేషన్ల కోసం తమ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయని, హార్దిక్ లేకున్నా పెద్దగా నష్టం ఏం జరగదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ హార్దిక్ ఫిట్ నెస్ సాధించి జట్టులోకి వచ్చినా.. కాంబినేషన్లు మాత్రం ఆపబోమని తేల్చిచెప్పాడు. టీమిండియాలో ప్రతీ ఆటగాడు సంసిద్ధంగా ఉన్నాడని, ఎవరికి అవకాశం వచ్చినా సత్తా చాటడానికి సిద్దంగా ఉన్నారని చెప్పాడు. ఒకరిపైనే అతిగా ఆధారపడే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించాడు.





Tags:    

Similar News