IND vs PAK: పాక్ దుమ్ము దులిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో..
అసలు ఇతను కెప్టెనేనా.. ఏం ఆడుతున్నాడు. ఫామ్లోనే లేడు. జట్టు కొంప ముంచుతున్నాడు. ముందుండి నడిపించాల్సిన వాడు.. ఇలా డక్ ఔట్ అయి డగౌట్ లో కూర్చుంటున్నాడేంటి? అసలు ఈసారైనా జట్టును ముందుకు తీసుకెళ్తాడా? వరల్డ్ కప్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శకులు అన్నమాటలివి. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ మినహా మిగతా రెండు మ్యాచుల్లో జట్టుకు వెన్నెముకలా నిలబడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్ ను ముందుండి నడిపించాడు. మొన్న ఆఫ్ఘనిస్తాన్, ఇవాళ పాకిస్తాన్ పై విజృంభించి 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. దీంతో రోహిత్ వన్డేల్లో 300 సిక్సర్లు పూర్తిచేసుకున్నాడు. విరాట్ (16), గిల్ (16) త్వరగా ఔట్ అయినా.. తను చేయాల్సిన పనిని దాదాపు పూర్తిచేశాడు. శ్రేయస్ అయ్యర్ తో కలిసి ఇన్నింగ్స్ ను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. షాహిన్ అఫ్రిది 2 వికెట్లు తీసుకోగా, సహన్ అలి ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత గెలుపు దాదాపు ఖాయం అయింది. క్రీజులో శ్రేయస్ (39), రాహుల్ (3) ఉన్నారు.
Rohit Sharma 5th six today .
— Mufaddal_vohra (@Mufaadal_Vohra) October 14, 2023
He is smashing Polio bowler Haris Rauf.#RohitSharma𓃵 #INDvsPAK pic.twitter.com/wckQ0kw2xS