ఫామ్లో లేకపోయినా.. విరాట్ కోహ్లీని దాటేసిన రోహిత్ శర్మ

By :  Bharath
Update: 2024-02-08 09:17 GMT

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రెస్ట్ తీసుకుని వచ్చినా.. పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. వరల్డ్ కప్ తర్వాత నుంచి జరిగిన ప్రతీ సిరీస్ లో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోనూ నిరాశపరిచాడు. కాగా వరుసగా ఫెయిల్ అవుతున్నా.. రోహిత్ టాప్ బ్యాటర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి టాప్ ప్లేస్ కు చేరాడు.

వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 13, రెండో ఇన్నింగ్స్ లో 14 పరుగులు చేసిన రోహిత్.. కోహ్లీని అధిగమించాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ లో ఇప్పటివరకు 29 మ్యాచుల్లో 48 యావరేజ్ తో 2242 పరుగులు చేశాడు. వీటిలో 7 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా కోహ్లీ టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉండటంతో.. రోహిత్ విఫలమైనా.. టాప్ ప్లేస్ కు దూసుకెళ్లాడు. మిగతా మ్యాచులకు కూడా కోహ్లీ దూరం అయ్యే అవకాశం ఉండటంతో.. రోహిత్ మరింత ముందుకు వెళ్లే చాన్స్ ఉంది. వీరి తర్వాత స్థానాల్లో పుజారా (1769), రహానే (1589) ఉన్నారు. యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరమైన పంత్ కూడా 1575 పరుగులతో ఐదో స్థానంలో ఉండటం విశేషం.






Tags:    

Similar News