రోహిత్ వద్దు.. ఆ ఇద్దరిట్లో ఎవరినైనా కెప్టెన్ చేయాలి

Update: 2023-06-14 16:39 GMT

టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా ఘోర పరాభవం తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వాలని లేదంటే కెప్టెన్ గా దిగిపోవాలని అభిమానులతో పాటు.. క్రికెట్ ఎక్స్ పర్ట్స్ కూడా విమర్శిస్తున్నారు. టీమిండియా.. టెస్ట్ క్రికెట్ ను శాసించే స్థాయికి ఎదిగేలా చేసిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్సీ వదిలాక.. ఘోరంగా విఫలం అవుతోంది. ఫైనల్ లోనే కాదు విదేశీ జట్లతో ఆడిన సిరీసుల్లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. అంతేకాకుండా టెస్టుల్లో అంతగా రికార్డులు లేని రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించింది బీసీసీఐ.

ఈ క్రమంలో రోహిత్ ను జట్టు పగ్గాలు అందుకుని అశ్విన్ ను లేదా రహానేను కెప్టెన్ చేయాలని కోరుతున్నారు. అశ్విన్ కు ధోనీకి ఉన్నన్ని టెక్నిక్స్ ఉన్నాయి. క్లిష్టమైన పరిస్థితుల్లో కూల్ గా జట్టును ముందుండి నడిపించగలడు. రహానే కూడా తక్కువేమి కాదు. కోహ్లీ లేని టైంలో ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను.. తన కెప్టెన్సీ మెలకువల్తో గెలిపించి చిరస్మరణీయ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందించాడు. రహానే మొత్తం 5 మ్యాచ్ లకు కెప్టెన్సీ చేయగా... అందులో 4 ఓడిపోగా, ఒకటి డ్రా అయింది. ఈ లెక్కన ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. రహానే బ్యాటింగ్ కూడా తిరిగి గాడిన పడింది. దీంతో చాలామంది రహానేను కెప్టెన్ చేయాలని కోరుతున్నారు. ఇన్ని పరిణామాల మధ్య రోహిత్ శర్మ కెప్టెన్సీ దిగుతాడా.. కొనసాగుతాడా చూడాలి. అయితే, కొందరు సీనియర్లు మాత్రం వెస్టిండీస్ ప్రదర్శన ఆధారంగా రోహిత్ శర్మ ఫ్యూచర్ డిసైడ్ అవుతుందని చెప్తున్నారు.

Tags:    

Similar News