Sachin deep fake video: సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో వైరల్

Byline :  Bharath
Update: 2024-01-15 08:49 GMT

సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రముఖుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ గేమింగ్ యాప్ సచిన్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి.. ప్రమోట్ చేస్తుంది. దీనిపై సచిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఆ వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.

‘టెక్నాలజీతో నకిలీ వీడియోలు సృష్టించి దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటివి ఎక్కడ కనిపించినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. సోషల్ మీడియా కూడా అప్రమత్తంగా ఉంటూ.. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. ఫేక్ సమాచారం, ప్రచారం, డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల’ని సచిన్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. 

Tags:    

Similar News