Sachin Tendulkar :దశాబ్దం కిందటే ‘కోహ్లీ’అని గెస్ చేసిన సచిన్.. అప్పుడేమన్నాడంటే?

Byline :  Bharath
Update: 2023-11-06 02:17 GMT

క్రికెట్ లో సచిన్ వారసుడిగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఆయన్ను మించిపోయాడు. ముఖ్యంగా వన్డే ఫార్మట్ లో సచిన 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. ఈ మైలురాయికి చేరుకోవడానికి సచిన్ కు 452 ఇన్నింగ్స్ ల సమయం పడితే.. కోహ్లీ మాత్రం 277 ఇన్నింగ్స్ లోనే చేరుకున్నాడు. తన తొలి సెంచరీ చేసిన గడ్డపైనే.. 49 సెంచరీని కూడా పూర్తిచేసుకున్నాడు. నిన్ని ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 101 పరుగులతో అజేయంగా నిలిచి తన బర్త్ డే రోజున ఈ ఫీట్ ను అందుకున్నాడు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ తన రికార్డ్స్ ను బద్దలు కొడతాడని సచిన 11 ఏళ్ల క్రితమే ఊహించాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. 2012లో ముఖేష్ అంబానీ ఓ ఈవెంట్ ఏర్పాటుచేశాడు. అందులో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ ఈవెంట్ లో మీ సెంచరీల రికార్డు బ్రేక్ చేసే సత్తా ఎవరికి ఉందని సచిన్ ను సల్మాన్ ఖాన్ ప్రశ్నించాడు. దానికి రిప్లై ఇచ్చిన సచిన ‘టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మలకే ఆ సత్తా ఉంది. ఖచ్చితంగా నా రికార్డులను వాళ్లే తిరగరాస్తారు. ఓ భారతీయుడు నా రికార్డులను అధిగమించాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.

49వ సెంచరీ పూర్తిచేసిన విరాట్.. మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ తీసుకుంటూ.. సచిన్ రికార్డును సమం చేయడంపై ఇలా అన్నాడు. ‘నా హీరో రికార్డును సమం చేయడం నాకు దక్కిన గౌరవం. అభిమానులు మా ఇద్దరిని పోల్చుతుంటారు. నేను ఆయనలా ఎప్పటికీ ఆడలేను, రాణించలేను. మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ చాలా పర్ఫెక్ట్. సచినే నా హీరో. ఇది నాకు చాలా భావోద్వేగ క్షణం. టీవీల్లో ఆయన ఆటను చూస్తూ పెరిగా’ అని ఎమోషనల్ అయ్యాడు కోహ్లీ. కాగా కోహ్లీ బర్త్ డే రోజు మ్యాచ్ గెలవడం, సెంచరీ చేసి సచిన్ రికార్డ్ సమం చేయడంతో కోహ్లీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.




Tags:    

Similar News