భర్త ఫొటోలు డిలీట్ చేసిన సానియా.. అందుకే అంటున్న నెటిజన్లు

Byline :  Kiran
Update: 2024-01-15 15:20 GMT

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి వార్తల్లోకెక్కారు. ఆమె త్వరలోనే విడాకులు తీసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించిన సానియా.. పెద్దలను ఒప్పించి 2010లో అతన్ని వివాహం చేసుకుంది. వీరికి ఇజాజ్ అనే కొడుకు ఉన్నాడు. అయితే సానియా షోయబ్ వైవాహిక జీవితం గురించి, వారి మధ్య సఖ్యత లేదని, విడాకుల తీసుకోనున్నారంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ పుకార్లపై షోయబ్, సానియాలు ఎప్పుడూ స్పందించలేదు.

గత కొంతకాలంగా సానియా పాకిస్థాన్లో కన్నా ఇండియాలోనే ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రాం అకౌంట్ నుంచి భర్త షోయబ్‌తో కలిసి ఉన్న ఫొటోలన్నింటినీ డిలీట్ చేసింది. షోయబ్ మాలిక్‌ సైతం గతంలోనే ట్విట్టర్‌ అకౌంట్‌లో రిలేషన్షిప్ స్టేటస్ నుంచి సానియా మీర్జా పేరును తొలగించగా.. తాజాగా ఇన్స్టాగ్రాంలోనూ డిలీట్ చేశాడు. సానియా- షోయబ్ మధ్య రిలేషన్ అంత బాగా లేకపోవడం వల్లే ఇలా డిలీట్ చేశారని నెటిజన్లు అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.

పాకిస్థానీ నటి ఆయేషా ఓమర్తో ఉన్న వివాహేతర సంబంధం వారి షోయబ్ మాలిక్, సానియా మధ్య బంధం బీటలువారేందుకు కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయేషా మాత్రం అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. పెళ్లైన వ్యక్తితో తాను ఎందుకు సంబంధం పెట్టుకుంటానని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఇటీవల సానియా పోస్ట్ చేసిన ఓ మెసేజ్ కూడా అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. ఒక విషయం మనసుకు బాధ కలిగిస్తున్నప్పుడు దాన్ని దూరం చేసుకోవడమే మేలంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సానియా, షోయబ్ జంట విడాకులకు సిద్ధమయ్యారనడానికి సంకేతాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Tags:    

Similar News