వరల్డ్ కప్కు భారత జట్టు రెడీ.. వారికి నో ఛాన్స్..!

Byline :  Krishna
Update: 2023-09-03 07:18 GMT

ఇంకో నెల రోజుల్లో దేశంలో క్రికెట్ పండుగా మొదలవుతోంది. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఇప్పటికే పలు దేశాలు వరల్డ్ కప్ జట్లను ప్రకటించాయి. ప్రస్తుతం అందరి దృష్టి టీమిండియా జట్టుపై ఉంది. ప్రస్తుతం ఇండియా ఆసియా కప్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది.

మరోవైపు జట్టు ఎంపికపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 5లోపు ఐసీసీకి టీం లిస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలో ఇవాళ లేదా రేపు భారత జట్టును అధికారికరంగా ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని మార్పులతో దాదాపు ఆసియా కప్ జట్టునే ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 17 మందితో ఉన్న ఆసియా కప్‌ జట్టు నుంచి ఇద్దరిని తీసేయాల్సి ఉంటుంది. దీంతో తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణకు తప్పించే అవకాశాలు ఉన్నాయి.

ఇక సంజూ శాంసన్కు మరోసారి నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్‌ ఫిట్నెస్ నిరూపించుకోవడంతో శాంసన్ తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. వరల్డ్ కప్ కోసం జట్టును ఖరారు చేయడానికి అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ శ్రీలంక వెళ్లింది. రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌లతో జట్టు ఎంపికపై చర్చలు జరిపింది. భారత్, పాక్ మ్యాచ్ వర్షంతో రద్దయిన తర్వాత వరల్డ్ కప్ జట్టు ఎంపికపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

భారత జట్టు అంచనా : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ.



Tags:    

Similar News