కొడుకుకి క్యాప్..తండ్రి కన్నీళ్లు.. ఎట్టకేలకు సర్ఫరాజ్ అరంగేట్రం
రాజ్ కోట్ టెస్టు సందర్బంగా టీమిండియా యువ క్రికెటర్ సర్పరాజ్ చరిత్ర సృష్టించారు. భారత్ తరపున అరంగేట్రం చేసేనాటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగి ఉన్న బ్యాటర్లలో ఆరు స్థానం నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సగటు తో 69.35తో 3.912 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్‌ను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వీరుడుగా పేరొందిన సర్ఫరాజ్ ఖాన్ కల నిజమైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు తరఫున తొలి టెస్టు మ్యాచ్ ఆడే చాన్స్ దక్కింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రాజ్‌కోట్ టెస్టు లో సర్ఫరాజ్ అరంగేట్రం చేశాడు. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ యంగ్‌స్టర్ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు.
తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన 311వ ఆటగాడిగా సర్ఫరాజ్ నిలిచాడు. కొడుకు భారత జట్టు టోపీ అందుకోవడంతో అతడి తండ్రి నౌషద్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. సర్ఫరాజ్‌ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. ఎట్టకేలకు తన కొడుకు టీమిండియా జెర్సీ వేసుకోవడం చూసి నౌషద్ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ పక్కనే ఉన్న సర్ఫరాజ్ భార్య కూడా ఆ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకుంది. దాంతో, అతడు ఆమె కండ్లు తుడిచి హత్తుకున్నాడు. ఈ దృశ్యం స్టేడియంలోని ప్రతి ఒక్కరిని కదిలించింది.దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు.. ప్రతి సీజన్‌లోనూ నిలకడైన ప్రదర్శన. భారత- ఎ జట్టు తరపున అవకాశం వచ్చిన ప్రతిసారి సర్ఫరాజ్ సత్తాచాటాడు. ఇప్పటివరకూ 45 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 3912 పరుగులు సాధించాడు. అతని సగటు 69.85గా ఉండటం విశేషం. 14 శతకాలూ చేశాడు. అతని అత్యధిక స్కోరు 301 నాటౌట్. ప్రతిభపరంగా, నైపుణ్యాల పరంగా, ఆట పరంగా సర్ఫరాజ్‌పై ఎలాంటి సందేహాలు లేవు. కానీ భారత జట్టులో తీవ్రమైన పోటీ కారణంగా ఇన్ని రోజులూ చోటు దక్కలేదు.