Asian games 2023 : బ్యాడ్మింటన్లో భారత్కు స్వర్ణం..

By :  Krishna
Update: 2023-10-07 09:34 GMT

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే దేశానికి వంద పతకాలు అందించిన క్రీడాకారులు తమ వేటను కొనసాగిస్తున్నారు. మెన్స్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌శెట్టి జోడీ స్వర్ణం దక్కించుకుంది. దీంతో భారత్‌ గెలిచిన మెడల్స్ సంఖ్య 101కి చేరింది. ఇప్పటివరకు 26 గోల్డ్, 35 రజతం, 40 కాంస్య పతకాలను దక్కించుకుంది.

అంతకుముందు భారత్ ఆర్చరీలో రెండు, మహిళల కబడ్డీలో పసిడి పతకాలను కైవసం చేసుకుంది. ఆర్చరీ పురుషుల కాంపౌండ్‌ ఈవెంట్‌లో ఓజస్ ప్రవీణ్ గోల్డ్‌ మెడల్‌ సాధించగా.. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఇక మహిళల కబడ్డి జట్టు స్వర్ణ పతకంతో దుమ్మురేపింది. అంతేకాకుండా ఆర్చరీలో అభిషేక్ వర్మకు రజతం, అధితి గోపించంద్ కాంస్య పతకాలు సాధించారు.

ఈ క్రమంలో భారత క్రీడాకారులను మోదీ అభినందించారు. ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు అద్భుతాలు సృష్టిస్తున్నారని అన్నారు. ‘‘భారత్ సాధించిన పతకాల సంఖ్య 100కి చేరడంతో దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన అథ్లెట్లకు నా అభినందనలు. మీ అసాధారణ ప్రతిభ మమ్మల్ని గర్వపడేలా చేస్తోంది. ఈ నెల 10న మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడం కోసం ఎదురుచూస్తున్నా’’ అని మోదీ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News