సెమీస్ రేస్ నుంచి ఔట్.. తక్కువ స్కోర్కు ఆఫ్గాన్ ఆలౌట్..

Update: 2023-11-10 12:53 GMT

వరల్డ్ కప్ సెమీస్ రేస్ నుంచి మరో టీం ఔట్ అయ్యింది. మోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో ఆప్ఘనిస్తాన్ 244 రన్స్ మాత్రమే చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 97 రన్స్తో రాణించగా.. మిగితా బ్యాట్స్ మెన్స్ అందరూ తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 4వికెట్లు పడగొట్టగా.. ఎన్గిడి 2, కేశవ్ మహరాజ్ 2, ఆండిలే ఫెహ్లుక్వాయో ఒక వికెట్ తీశారు.

ఈ మ్యాచ్లో ఆప్గాన్ తక్కువ స్కోర్ చేయడంతో సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆప్గాన్ నెట్ రన్ రేట్ -0.338, కివీస్ +0.743గా ఉంది. ఆప్గాన్ సెమీస్ చేరాంటే 438 రన్స్ తేడాతో గెలవాలి. కానీ ఆ టీం 244 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కాగా శనివారం పాకిస్థాన్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరగనుంది. పాక్ సెమీస్ చేరాలంటే 287 రన్స్ తేడాతో విజయం సాధించాలి.


Tags:    

Similar News