శ్రేయస్ అయ్యర్ రెడీ.. పాపం కేఎల్ రాహుల్ పరిస్థితే దారుణం
ఆసియా కప్ నుంచి టీమిండియా ఆటగాళ్ల పరిస్థితి అంత బాగోలేదు. స్టార్ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయాబారిన పడి టీంకు దూరం అయ్యారు. దాంతో కీలక టోర్నీల్లో మెయిన్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా... బొక్క బోర్లా పడిన విషయం తెలిసిందే. జస్త్రిత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం అయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
బుమ్రా, శ్రేయస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. బుమ్రా నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. శ్రేయస్ ఇప్పుడిప్పుడే బ్యాట్ పట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు. వీళ్లిద్దరు ఐర్లాండ్ సిరీస్ కు జట్టులో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితే ఎటూ తేలండం లేదు. కుడి తొడకు సర్జరీ చేయించుకున్న రాహుల్.. ఈ వారంలో ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడే గ్రౌండ్ లోకి దిగితే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. మరి రాహుల్ ఆసియా కప్ టైంకన్నా కోలుకుంటాడా లేదా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.