Shubman Gill : ఇంగ్లాండ్ పై ఘన విజయం.. పీటర్సన్కు సారీ చెప్పిన గిల్

Byline :  Bharath
Update: 2024-02-05 13:28 GMT

(Shubman Gill ) ఇంగ్లాండ్ పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ అనంతరం భారత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కాగా శుభ్ మన్ గిల్ తనకు మద్దతిచ్చిన ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అదే సమయంలో అతనికి క్షమాపణలు చెప్పాడు.




 


మొదటి టెస్టులో, రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో గిల్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో మాజీలు, అభిమానులు అతనిపై తీవ్ర విమర్శలు చేశారు. గిల్ ను జట్టు నుంచి తప్పించి సర్ఫరాజ్ ఖాన్ ను ఆడించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో పీటర్సన్ గిల్ కు మద్దతునిచ్చాడు. సౌతాఫ్రికా మాజీ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ తన మొదటి 10 టెస్ట్‌ల్లో 22 సగటేనని.. ఆ తర్వాత పుంజుకుని అతను అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారని గుర్తుచేశాడు. గిల్ కు అవకాశం ఇవ్వాలని, అతను కూడా గొప్ప ప్లేయర్ అవుతాని చెప్పుకొచ్చాడు. గిల్ కు మరికొంత కాలం సమయం ఇవ్వాలని చెప్పాడు. ఆ మాటలనుంచి ప్రేరణ పొందిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. మ్యాచ్ అనంతరం పీటర్సన్ కు గిల్ థాంక్స్ చెప్పాడు. అదే సమయంలో సారీ చెప్తూ.. ‘మిమ్మల్ని కలవనందుకు క్షమించండి. వేలికి గాయం అయినందుకు స్కానింగ్ కు వెళ్తున్నా. వచ్చాక తప్పకుండా కలుస్తా’ అని గిల్ చెప్పాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ బొటనవేలికి గాయమైంది. దీంతో అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్ చేశాడు. 






Tags:    

Similar News