Icc World Cup 2023: టీమిండియా కొంప ముంచిన దోమ.. రెండో మ్యాచ్కు స్టార్ ప్లేయర్ దూరం

By :  Bharath
Update: 2023-10-09 12:21 GMT

వరల్డ్ కప్ సమరాన్ని టీమిండియా విజయంతో ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పోరాటంతో.. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం టీమిండియా బుధవారం (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఓ చేదు వార్త టీమిండియాను కలవర పెడుతుంది. డెంగీ జ్వరంతో బాధపడుతున్న శుభ్ మన్ గిల్ ఆసీస్ తో జరిగిన తొలి మ్యాచ్ కు దూరం అయిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా బరిలోకి దింపారు. అయితే గిల్ ఆఫ్ఘన్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉంటారనుకున్నారంతా.



కానీ, గిల్ రెండో మ్యాచ్ కు కూడా దూరం అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గిల్ ప్రస్తుతం చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. టీమిండియాతో పాటు ఢిల్లీకి వెళ్లట్లేదని తెలిపింది. సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ జట్టుకు దూరం అవ్వడం కాస్త ఇబ్బంది పెట్టే అశమే. ఇప్పటివరకు ఆడిన సిరీసుల్లో రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేసిన గిల్ వన్డేల్లో ఐదు సెంచరీలు సాధించాడు. వరల్డ్ కప్ కు ముందు ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో కూడా చెలరేగాడు. రెండు మ్యాచుల్లో ఒక సెంచరీ, హాప్ సెంచరీతో అదరగొట్టాడు.

Tags:    

Similar News