Sikandar Raza : టీ20ల్లో సికిందర్ రాజా సరికొత్త చరిత్ర.. ఇన్నేళ్లలో ఎవరికీ సాధ్యం కాలేదు..!

Byline :  Bharath
Update: 2024-01-16 04:55 GMT

‘సికిందర్ రజా.. క్రికెట్ లో బాగా గుర్తుండిపోయే పేరవుతుంది’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జింబాబ్వే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి.. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. జట్టుకు గొప్ప విజయాలు అందిస్తున్నాడు. తాజాగా మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో మహామహులకు సాధ్యం కాని రికార్డ్ ను నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఈ ఫీట్ అందుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 62 పరుగులు చేసిన సికిందర్.. వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు.

వరుసగా ఐదు టీ20ల్లో 58, 65, 82, 65, 62 స్కోర్లు చేశాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో సికిందర్ రువాండాపై 58, నైజీరియాపై 65, కెన్యాపై 82 పరుగులు చేశాడు. తర్వాత జింబాబ్వేలో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 65 పరుగులు చేశాడు. ఇప్పుడు శ్రీలంకపై కూడా 62 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించాడు. అగ్రశ్రేణి బ్యాటర్లు, హిట్టర్లకు ఇప్పటి వరకు సాధ్యం కాని రికార్డ్ ను నెలకొల్పాడు. కాగా బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్), క్రిస్‌ గేల్ (వెస్టిండీస్), క్రెయిగ్ విలియమ్స్‌ (నమీబియా), రేయాన్ పఠాన్ (బెర్ముడా), గుస్తావ్ మెకియోన్ (ఫ్రాన్స్‌), రిజా హెండ్రిక్స్‌ (సౌతాఫ్రికా) టీ20ల్లో వరుసగా నాలుగు అర్థ సెంచరీలు చేశారు. వాళ్లను అదిగమించిన సికిందర్ రజా.. సరికొత్త రికార్డ్ ను నెలకొల్పాడు.





Tags:    

Similar News