క్రికెట్ స్టేడియంలో పాము కలకలం

Update: 2023-07-31 16:52 GMT

సాధారణంగా వర్షం కురిస్తేనో, వాతావరణం అనుకూలంగా లేకపోతేనో , పిచ్ పెర్ఫెక్ట్‎గా ఉండకపోతేనో క్రికెట్ మ్యాచులను ఆపేస్తుంటారు. కానీ శ్రీలంకలోని ఓ స్టేడియంలో జరిగే లంక ప్రీమియర్ లీగ్‎ 2023కి మాత్రం ఓ సర్పం అంతరాయం కలిగించింది. ఉన్నట్లుండి స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇచ్చి ఆటగాళ్లకు షాక్ ఇచ్చింది. ఆరు అడుగుల జెర్రిపోతును చూసి అంతా అవాక్కయ్యారు. పామును తరిమేందుకు మైదానంలోని ఎవరూ రాలేదు. దీంతో ఆటగాళ్లు కాసేపు ఆటను కాఆపేశారు. అదృష్టవశాతత్తు దానంతట అదే బౌండరీ దాటి బయటికి వెళ్లిపోవడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్- 2023 మ్యాచులు జరుగుతున్నాయి. గాలె టైటాన్స్ , దంబుల్లా ఆరా మధ్య మ్యాచ్ నడుస్తోంది. దంబుల్లా టీమ్ బ్యాటింగ్ చేసే సమయంలో పాము మైదానంలోకి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చింది. గ్రౌండ్‎లో క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరాలు ఉన్నారు. పామును చూసిన ఆటగాళ్లు కాసేపు మ్యాచ్‎ను ఆపేశారు. సాధారణంగా ఇలాంటి జంతువులు వచ్చినప్పుడు వాటిని తరిమేందుకు గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు. కానీ పామును బయటికి పంపించేందుకు ఆ సమయంలో ఎవరూ రాలేదు. లక్కీగా పాము దానంతట అదే బౌండరీ బయటికి వెళ్లిపోయింది. అనంతరం అప్రమత్తం అయిన సిబ్బంది పామును బయటికి పంపించేశారు. పాము గ్రౌండ్ నుంచి వెళ్తున్న వీడియోను సిబ్బంది తీశారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆరడుగుల పొడవున్న జెర్రిపోతు పాము మైదానంలో ప్రవేశించడాన్ని చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.


Tags:    

Similar News