నదిలో స్నానం.. దాడిచేసి సాకర్ ప్లేయర్ని చంపిన మొసలి

Update: 2023-08-05 16:35 GMT

కోస్టారికా ఫుట్ బాల్ జట్టులో విషాదం నెలకొంది. సాకర్ ఆటగాడు జీసస్ ఆల్బర్టో లోపెజ్ ఆర్టిజ్ (29).. మొసలికి బలయ్యాడు. సరదాగా ఈతకు వెళ్లిన అతన్ని.. నీటిలోకి దిగగానే మొసలి మింగేసింది. కోస్తారికా రాజధానికి 140 కి.మీ.లో ఉన్న కనాస్ నది మొసళ్లకు ప్రసిద్ధి. దాంతో అక్కడ ఫిషింగ్, ఈతను నిషేదించారు. ఈ విషయం తెలిసినా ఆర్టిజ్ నది దగ్గర ఎక్సర్ సైజ్ చేశాడు. తర్వాత నదిలోకి దిగి ఈత కొట్టాడు. అతను నీటిలోకి దిగిన వెంటనే దాడిచేసిన మొసలి నీళ్లలోకి లాకెళ్లింది. ఆర్టిజ్ దాన్ని నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. మొసలి ఆర్టిజ్ శవాన్ని నోట్లో కరుచుకుని నదిలో తిరుగుతున్న దృశ్యాలతో భయానక వాతావరణం ఏర్పడింది. చివరికి స్థానిక పోలీసులు వచ్చి మొసలిని గన్ తో కాల్చి చంపారు. తర్వాత ఆర్టిజ్ శవాన్ని బయటికి తీసి కుటుంబానికి అప్పగించారు. ఆర్టిజ్ మరణంతో అతని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆర్టిజ్ కు ఇద్దరు పిల్లలున్నారు.





Tags:    

Similar News