Aus vs SA: వరుసగా రెండో సెంచరీ.. ఆసీస్కు భారీ టార్గెట్

By :  Bharath
Update: 2023-10-12 13:13 GMT

లక్నో వేదికపై అస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ అమీతుమీ పోరు నడుస్తుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిన ఆసీస్.. ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తుంది. శ్రీలంకపై భారీ విక్టరీతో వరల్డ్ కప్ ను మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. అదే జోరును కొనసాగించాలని చూస్తుంది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. ఓపెనర్ క్వింటర్ డికాక్ (109, 106 బంతుల్లో) వరల్డ్ కప్ లో వరుసగా రెండో సెంచరీ చేశాడు.

మరో ఓపెనర్ బవుమా (35) రాణించాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన మార్క్రమ్ (56, 44 బంతుల్లో) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మిగతా సౌతాఫ్రికా బ్యాటర్లు వాన్ డర్ డస్సెన్ (26), క్లసెన్ (29), మార్కో జాన్సన్ (26), మిల్లర్ (17) పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. స్టార్క్, మ్యాక్స్ వెల్ రెండు వికెట్లు తీసుకోగా.. హాజెల్ వుడ్, కమ్మిన్స్, జాంపా చెరో వికెట్ పడగొట్టారు. మ్యాక్స్ వెల్ (3.40 ఎకానమీ) మినహా ఏ ఆసీస్ బౌలర్.. సౌతాఫ్రికా బ్యాటర్ ను అడ్డుకోలేకపోయారు.

Tags:    

Similar News