Virat kohli birthday: సౌతాఫ్రికాదే పై చేయి.. మరి బర్త్ డే గిఫ్ట్ ఇస్తారా!
ప్రపంచ కప్ పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉన్న రెండు జట్లు ఇవాళ తడబుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికపై భారత్, సౌతాఫ్రికా మధ్య మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఇరు జట్లు పటిష్టంగా కనిపిస్తుండటంతో.. భీకర పోరు తప్పదని ఫాన్స్ ఆశిస్తున్నారు. ఈ వరల్డ్ కప్ లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్.. ఆడిన ఏడు మ్యాచుల్లో అన్నీ గెలిచి సెమీస్ క్వాలిఫై అయింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి 7 మ్యాచ్ ల్లో ఆరుగెలిచి టేబుల్ లో 2వ స్థానంలో నిలిచింది. కాగా వన్డేల్లో ఇప్పటి వరకు భారత్ పై సౌతాఫ్రికాదే పై చేయి ఉంది. ఇప్పటివరకు ముఖాముఖిగా 90 మ్యాచ్ లు ఆడగా.. అందులో భారత్ 37 మ్యాచుల్లో గెలవగా.. సౌతాఫ్రికా 50 మ్యాచుల్లో గెలిచింది.
3 టై అయ్యాయి. కాగా ఇవాళ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు కానుకగా మ్యాచ్ గెలిచి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఈడెన్ గార్డెన్స్ యజమానులు కూడా కోహ్లీ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. కోల్ కతా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండటంతో.. ఈ మ్యాచ్ భారీ స్కోర్ పక్కా అనుకోవచ్చు. ఇరు జట్లు బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తున్నాయి. టోర్నీలో సౌతాఫ్రికా బ్యాటర్లు సృష్టిస్తున్న విద్వంసం గురించి తెలిసిందే. టీమిండియా పేస్, స్పిన్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. మరి ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.