AUS vs SA Semi-Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

Update: 2023-11-16 08:27 GMT

కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్ లో ఇవాళ సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ సెమిస్ -2 మ్యాచ్ జరుగుతోంది. ఈమ్యాచ్ లో ముందు సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. బలాబలాల్లో ఇరుజట్లూ సమవుజ్జీలే. టోర్నీలో అద్భుతంగా రాణించాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాంతరంగా ఉన్నాయి. ఇలాంటి జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఎంత ఉత్కంఠ ఉంటుంది. ఐదుసార్లు చాంపియన్ ఒక జట్టు.. నాలుగుసార్లు సెమీస్‌ చేరినా.. ఫైనల్లో అడుగుపెట్టని సఫారీలు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ కీలక పోరుకు వరుణుడు అడ్డుపడే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. కాగా ఉదయం చిరుజల్లులు కురవగా.. గ్రౌండ్ స్టాఫ్ పిచ్ ను కవర్లతో కప్పేశారు. ప్రస్తుతం పొడి వాతావరణమే ఉంది.

ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక వర్షం పడితే మ్యాచ్ ను రిజర్వ్ డేకు మార్చుతారు. అంటే రేపు కొనసాగిస్తారు. రేపు కూడా మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే.. పాయింట్స్ టేబుల్ లో ఆసీస్ కన్నా సౌతాఫ్రికాను ముందుండటంతో సఫారీలను విజేతలుగా ప్రకటింస్తారు. అప్పుడు ఫైనల్ మ్యాచ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఆదివారం (నవంబర్ 19) జరుగుతుంది. కాగా చివరిసారిగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు 1999లో సెమీస్ లో తలపడ్డాయి. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఇరు జట్లు మళ్లీ సెమీస్ లో తలపడుతున్నాయి.

ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. లుంగి ఎంగిడి స్థానంలో తబ్రేజ్‌ షంషి తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్‌,సీన్‌ అబాట్‌ల స్థానాల్లో మ్యాక్స్‌వెల్‌, స్టార్క్‌ రీఎంట్రీ ఇచ్చారు.

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్‌), టెంబా బవుమా(కెప్టెన్‌), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి

ఆస్ట్రేలియా జట్టు: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

Tags:    

Similar News