వరల్డ్ కప్ సెమీస్ రేస్ నుంచి ఆఫ్గానిస్తాన్ ఔట్ అయ్యింది. మోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆఫ్గాన్ 5వికెట్ల తేడాతో ఓడిపోయింది. 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 47.3ఓవర్లలో టార్గెట్ను చేధించింది. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 76, క్వింటన్ డి కాక్ 41, ఆండిలే ఫెహ్లుక్వాయో 39 రన్స్తో రాణించారు. ఆఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, నబీ తలో 2 వికెట్లు తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ 50ఓవర్లలో 244 రన్స్ చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 97 రన్స్తో రాణించగా.. మిగితా బ్యాట్స్ మెన్స్ అందరూ తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు.
ఈ మ్యాచ్లో ఓటమితో ఆఫ్గాన్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఒకవేళ సెమీస్ చేరాలన్న ఆఫ్గాన్ 438 రన్స్ తేడాతో గెలవాలి. కాగా శనివారం పాకిస్థాన్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరగనుంది. పాక్ సెమీస్ చేరాలంటే 287 రన్స్ తేడాతో విజయం సాధించాలి.