బౌలింగ్తో భయపెట్టారు.. లంకకు ఈజీ టార్గెట్!
ఆసియాకప్ సమరంలో పల్లెకలె వేదికపై మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకతో ఆడుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయింది. లంక సూపర్ బౌలింగ్ ముందు బంగ్లా బ్యాటర్స్ చాపచుట్టేశారు. చైన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, శ్రీలంక పేస్ బౌలర్ మతీష పతిరణ 4 వికెట్లతో చెలరేగాడు. దీంతో బంగ్లా బ్యాటర్లలో నజ్యుల్ షాంటో (89, 122 బంతుల్లో) మినహా ఏ బ్యాట్స్ మెన్ కూడా 30 పరుగులు దాటలేక పోయాడు. తీక్షణ 2 వికెట్లు తీసుకోగా.. వెల్లలాగే, శనక, ధనంజయ చెరో వికెట్ పడగొట్టారు. శ్రీలంక బౌలర్ల ముందు ఏ బంగ్లా బౌలర్ నిలవలేకపోయాడు. మహమ్మద్ నైమ్ (16), తౌహిద్ హృదయ్ (20), రహిమ్ (13) ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ షకీబల్ హసన్ (5) సహా ప్రతీ ఒక్కరు విఫలమయ్యారు.