ENG vs SL : ఇంగ్లాండ్కు షాక్.. శ్రీలంక చేతిలో ఘోర పరాభవం..

By :  Kiran
Update: 2023-10-26 14:44 GMT

వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ మరోసారి ఓటమి పాలైంది. పసికూన అఫ్గాన్‌ చేతిలో ఓడిన ఇంగ్లాండ్ తాజాగా శ్రీలంక చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ కు దిగిన ఇంగ్లాండ్.. లంక బౌలర్ల ధాటికి 156 పరుగుల స్వల్ప లక్ష్యానికే కుప్పకూలింది. 157 రన్స్ టార్గెట్ ను శ్రీలంక కేవలం 2 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే పూర్తి చేసింది. కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ స్వల్పస్కోరుకే పెవిలియన్ బాట పట్టినా పాథుమ్‌ నిశాంక 77* (83 బాల్స్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సదీర విక్రమార్క 65* (54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) రన్స్ చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకోవడంతో శ్రీలంక ఈజీగా టార్గెట్ పూర్తి చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ రెండు వికెట్లు తీశాడు.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ కు దిన ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్‌ పిచ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంక పేసర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్కుకు చేరుకోలేకపోయారు. బెన్‌స్టోక్స్‌ 43 (73 బాల్స్లో 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌ గా నిలిచారు. జానీ బెయిర్‌స్టో 31 బంతుల్లో 3 ఫోర్లతో 30 రన్స్ చేశాడు. డేవిడ్ మలన్ 28 (25 బంతుల్లో 6 ఫోర్లు) నిలకడగానే ఆడినా ఎక్కువ సమయం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. జోరూట్ (3,) జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్‌స్టోన్ (1) రన్ కే పెవిలియన్ బాట పట్టారు. మొయిన్ అలీ 15 బంతుల్లో 15రన్స్ చేశాడు. క్రిస్‌ వోక్స్‌ (0), ఆదిల్ రషీద్‌ (2), మార్క్‌ వుడ్ (5), డేవిడ్ విల్లీ (14*) పరుగులు మాత్రమే చేశారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 3, ఏంజెలో మాథ్యూస్‌ 2, కాసున్ రజిత 2, మహీశ్‌ తీక్షణ ఒక వికెట్ తీశారు.

శ్రీలంకపై ఓటమితో ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ జట్టు బంగ్లాదేశ్తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. కివీస్‌, అఫ్గానిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓడింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా విజయం సాధిస్తేనే ఇంగ్లాండ్ జట్టు సెమీస్‌కు చేరే ఛాన్సుంది.




Tags:    

Similar News