Afghanistan vs Srilanka : తక్కువ స్కోర్కే శ్రీలంక ఆలౌట్.. ఆఫ్గాన్ టార్గెట్ ఎంతంటే..?

Byline :  Krishna
Update: 2023-10-30 13:15 GMT

పూణే వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్లో ఆఫ్గాన్ బౌలర్లు సత్తా చాటారు. బ్యాటింగ్ పిచ్లో లంకను తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. 49.3 ఓవర్లలో 241 రన్స్కే శ్రీలంక ఆలౌట్ అయ్యింది. పాతుమ్ నిస్సాంక మాత్రమే 46 రన్స్ చేయగా.. మిగితా బ్యాట్స్మెన్స్ 40 లోపే ఔట్ అయ్యారు. కుశాల్ మెండిస్ 39, సదీర సమరవిక్రమ 36 చేయగా.. చివర్లో మహేశ్ తీక్షణ 29 రన్స్ చేయడంతో లంక 241 రన్స్ చేయగలిగింది. ఆప్గాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ 4 వికెట్లు తీయగా.. ముజీబ్ 2, అజ్మతుల్లా, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఈ టోర్నీలో ఇరు జట్లు రెండు మ్యాచుల్లో గెలిచి మూడింట ఓడాయి. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి పైచేయి సాధించాలని చూస్తున్నాయి. పాయింట్స్ టేబుల్ లో శ్రీలంక ఐదో స్థానంలో ఉండగా.. ఆఫ్గాన్ ఏడో స్థానంలో ఉంది. ఇది రషీద్ ఖాన్కు వన్డేల్లో 100వ మ్యాచ్ కావడం విశేషం.


Tags:    

Similar News