Sunil Narine : సునీల్ నరైన్ సంచలన నిర్ణయం.. క్రికెట్కు..

By :  Krishna
Update: 2023-11-05 15:52 GMT

వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్ సునీల్‌ నరైన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇవాళ సోషల్‌ మీడియా వేదికగా నరైన్‌ తన నిర్ణయాన్ని తెలిపాడు. ‘‘నా ఫ్యాన్స్, నన్ను ఆదరించేవారికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతుడ్ని" అని నరైన్ పోస్ట్ చేశాడు. 35 ఏళ్ల నరైన్ తన కెరీర్​లో 65 వన్డేలు, 51 టీ20లు, 6 టెస్టులు ఆడాడు. అన్ని ఫార్మాట్​లలో కలిపి 165 వికెట్లు పడగొట్టాడు.

సునీల్ నరైన్‌ వెస్టిండీస్‌ తరపున చివరగా 2019లో​ఆడాడు. తన చివరి టెస్టు 2013లో ఆడగా.. వన్డే మ్యాచ్‌ 2016లో ఆడాడు. 2012 టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన వెస్టిండీస్‌ టీంలో నరైన్‌ కూడా ఉన్నాడు. నరైన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికినప్పటికీ.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగనున్నాడు. కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరుపున నరైన్‌ ఆడుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News