మీరు మాకొద్దు.. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం

Update: 2023-08-01 11:54 GMT

తొలి సీజన్ లో చిన్న టీంగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్.. అద్భుత ఆటతీరు కనబరిచింది. తర్వాత సీజన్స్ లో ప్లేఆఫ్స్ చేరి అందరికీ షాక్ ఇచ్చింది. జట్టులో పేరుపొందిన ఆటగాళ్లు ఎవరు లేకపోయినా.. ఉన్న కొన్ని వనరులతో 2016లో ఫైనల్ చేరి కప్పు ఎగరేసుకుపోయింది. తర్వాత సీజన్స్ లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లగలిగినా.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి సన్ రైజర్స్ పతనం ప్రారంభం అయింది. టీంలో ఉన్న కొద్ది మంది స్టార్ ఆటగాళ్లను వదులుకోవడం, ఆక్షన్ లో అనామక ప్లేయర్లను కొనుగోలు చేసి.. సీజన్స్ లో ఫెయిల్ అవుతూ వస్తుంది. 2023 ఆక్షన్ లో అయినా మంచి ప్లేయర్లను తీసుకుంటుంది అనుకుంటే.. అనవసర ఆటగాళ్లపై డబ్బు ఖర్చు చేసి మరోసారి ఫెయిల్ అయింది. దాంతో అందరు టీం మేనేజ్మెంట్ పై మండిపడ్డారు.

ఈ క్రమంలో 2024 ఐపీఎళ్ కోసం పెద్ద ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రూ. 13 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్స్ తో సహా.. స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్లను వదులుకునేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ జాబితాలో హెడ్ కోచ్ బ్రయాన్ లారా కూడా ఉన్నాడు. దీంతో మరోసారి హైదరాబాద్ ఫ్యాన్స్ లో గుబులు మొదలయింది. వదిలేస్తున్నారు సరే.. ఈసారైనా మంచి ప్లేయర్స్ ను ఎంపిక చేయాలని తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు.


Tags:    

Similar News