సూర్యకుమార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు...

Update: 2023-08-09 11:22 GMT

టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ నెం.1 బ్యాట్స్‌మెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పొట్టి ఫార్మెట్ లో అతను ఎంత డేంజరో మరోసారి చాటిచెప్పాడు. వెస్టిండీస్ పై మూడో టీ20లో సూర్యాభాయ్ రెచ్చిపోయాడు. మెరుపు అర్థసెంచరీతో చెలరేగాడు. కేవలం 44 బంతుల్ల ఆడిన సూర్యకుమార్ 83 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లతో పాటు 4 సిక్సర్లు ఉన్నాయి.

ఈ ఇన్నింగ్స్ ద్వారా సూర్యకుమార్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ లో 4 సిక్సర్లు బాదిన సూర్య..100 సిక్స్‌ల మార్క్ ను అందునుకున్నాడు. 49వ ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ ఈ ఘనత అందుకున్నాడు. తద్వారా అత్యంత వేగంగా 100 సిక్స్ లు కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. అదే విధంగా సిక్సర్ల సెంచరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సూర్యకంటే ముందు ఉన్నారు. ఇప్పటిరకు ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో మొత్తం 182 సిక్స్‎లు ఉన్నాయి. 117 సిక్సర్లతో విరాట్ టాప్ 10లో ఉన్నాడు.

మ్యాచ్ విషయానికొస్తే సూర్యకుమార్ విధ్వంసానికి తెలుగు తేజం తిలక్ వర్మ (37 బంతుల్లో 49 నాటౌట్) మెరుపులు తోడవ్వడంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో చేధించింది.

Tags:    

Similar News