World Cup 2023: చెన్నై చేరుకున్న భారత్‌, ఆస్ట్రేలియా జట్లు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-04 08:54 GMT

రేపటి నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023 ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో తలపడబోతోంది. మొత్తం పది జట్లు పాల్గొనే ఈవెంట్లో మొత్తం 47 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. ప్రతి టీమ్ మిగతా 9 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ స్టేజ్‌లో 45 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

ఈ వరల్డ్‌ కప్‌లో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో ఆడనుంది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో అక్టోబర్‌ 8న ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్లు ఇవాళ చెన్నైకి చేరుకున్నాయి. చెన్నై ఎయిర్‌పోర్టులో దిగిన రెండు జట్ల ఆటగాళ్లు.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో హోటళ్లకు బయలుదేరాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.




Tags:    

Similar News