ఆస్ట్రేలియాపై విజయం.. అన్ని ఫార్మాట్లలో టీమిండియా నెంబర్ 1..

By :  Kiran
Update: 2023-09-22 17:11 GMT

వ‌న్డేల్లో టీమిండియా మ‌ళ్లీ నంబ‌ర్ 1ర్యాంక్ ద‌క్కించుకుంది. ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ తొలి వ‌న్డేలో అద్భుత‌ విజ‌యం సాధించిన టీమిండియా 116 పాయింట్ల‌తో ఫస్ట్ ప్లేస్కు చేరింది. 115 పాయింట్లతో పాకిస్థాన్‌ సెకండ్ ప్లేస్కు ప‌డిపోయింది. మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఆసీస్ మూడో స్థానంతో స‌రిపెట్టుకుంది. టీమిండియా ఇప్పటికే T 20, టెస్ట్ ఫార్మాట్లలో నెంబర్-1 ప్లేస్లో ఉంది.. తాజాగా ఆసీస్ పై విజయం సాధించడంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో అగ్రస్థానానికి చేరింది.

మొహాలీ స్టేడియంలో ఉత్కంఠంగా సాగిన తొలి వన్డేలో రాహుల్ సేన‌ ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. దీంతో ఈ స్టేడియంలో ఆసీస్‌పై 13 ఏండ్ల తర్వాత తొలిసారి టీమిండియా గెలుపొందింది. ఇక, ఆసీస్ నిర్ధేశించిన 277 పరుగుల లక్ష్య ఛేద‌న‌లో ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74 పరుగులు చేయగా, రుతురాజ్ గైక్వాడ్ 77 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేసి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కేవలం 3 పరుగులకే రనౌటై పెవిలియన్ బాట పట్టాడు. దీంతో బరిలోకి దిగిన కెప్టెన్ కేఎల్ రాహుల్ 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 50 పరుగులు చేసి కీల‌క ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుకు గెలుపును అందించారు.

Tags:    

Similar News