జట్టులో చోటు దక్కలేదని కెమెరా ముందు కంటతడి పెట్టుకున్న క్రికెటర్

By :  Kiran
Update: 2023-07-07 01:55 GMT

టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ కెమెరా మందు కంటతడి పెట్టుకుంది. తనను టీంలోకి తీసుకోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ టూర్ లో భాగంగా బీసీసీఐ ఎంపిక చేసిన టీ20, వన్డే జట్టుల్లో తనకు స్థానం దక్కకపోయే సరికి ఓ ఇంటర్వ్యూలో ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘మనం కష్టానికి ప్రతిఫలితం దక్కనప్పుడు బాధగా ఉంటుంది. ప్రస్తుతం.. మెనేజ్మెంట్ పైన నేను నిరుత్సాహంగా, కోపంగా లేను అని చెప్తే.. నేను మనిషిని కాదు. జన్ను సెలక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలియదు. ఆటను ఎంజాయ్ చేస్తున్నంత వరకు నేను క్రికెట్ ఆడుతూనే ఉంటా’ అని ఎమోషనల్ అయింది.




 


సీనియర్ బౌలర్ అయిన శిఖా పాండే.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహించి.. ఢిల్లీ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచింది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడిన శిఖా పాండే పేరు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ లో లేదు. ఇప్పుడు జట్టులో చోటు కల్పించలేదు. దాంతో ఏమీ అంతుపట్టని శిఖా.. అసంతృప్తి వ్యక్తం చేసింది.




 


Tags:    

Similar News