IND vs NEP: లగాన్ సినిమా చూశారా?.. INDvsNEP మ్యాచ్ లైవ్లో చూడండి!

Byline :  Bharath
Update: 2023-09-04 12:44 GMT

నేపాల్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. మెయిడెన్ బంతులతో అటాక్ చేస్తూ.. ఏ నేపాల్ బౌలర్ ను క్రీజులో కుదురుకోనివ్వడం లేదు. 38 ఓవర్లలో కేవలం 7 ఎక్స్ ట్రాలు మాత్రమే ఇచ్చారు. అందులో రెండే వైడ్లు ఉన్నాయి. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ తో జడేజా, కుల్దీప్ నేపాల్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్స్ భారత ఫీల్డర్లపై మండిపడుతున్నారు. పాక్ తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్ల ముందు కూడా నిలవడం కష్టమేనని అనుకున్నారంతా. కానీ, భారత ఫీల్డింగ్ తప్పిదాలను కరెక్టుగా వాడుకున్న నేపాల్ బ్యాటర్లు రాణించారు.

ఓపెనర్లిద్దరూ 10 ఓవర్ల పాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు. క్యాచేలే కాదు రన్స్ ఆపడంలో కూడా మన ఆటగాళ్లు నిరాశ పరిచారు. చేతిలో ఉన్న బంతుల్ని ఒడిసిపట్టలేకపోయారు. విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శార్దూల్, గిల్.. ఇలా ఫీల్డర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. టీమిండియా ఫీల్డింగ్ చూస్తుంటే ఏదో నాసిరకం ఆటగాళ్లలా అనిపించిందని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మొత్తం నాలుగు చేతిలోకి వచ్చిన సింపుల్ క్యాచ్ లను వదిలేశారు మన ఆటగాళ్లు. దీంతో సోషల్ మీడియా వ్యాప్తంగా ఆటగాళ్లను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. లగాన్ సినిమా లైవ్ లో చూపిస్తున్నారంటూ.. సినిమా క్లిప్స్ ను షేర్ చేస్తున్నారు. ఈ ఫీల్డింగ్ తో వరల్డ్ కప్ కు వెళ్తారా? ఇకనైనా మారండంటూ ఎద్దేవా చేస్తున్నారు.



Tags:    

Similar News