World Cup Final Match : కమాన్ ఇండియా.. భారీ టార్గెట్తో ఆస్ట్రేలియాను చిత్తు చేయండి

Byline :  Krishna
Update: 2023-11-19 10:50 GMT

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు భయం పుట్టించాలంటే టీమిండియా భారీ స్కోర్ చేయాలి. టార్గెట్ పెద్దగా ఉంటే ప్రత్యర్థిపై ఒత్తిడి ఉంటుంది. అందుకే ఇండియా భారీ స్కోర్ చేస్తే ఆసీస్పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అటు సోషల్ మీడియాలోనూ కమాన్ ఇండియా.. టార్గెట్ పెద్దదిగా ఉంటాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 23ఓవర్లు ముగిసేసరికి 125/3గా ఉంది. కోహ్లీ 45, కేఎల్ రాహుల్ 23 రన్స్తో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరిపైనే భారత్ ఆశలున్నాయి. మరోవైపు ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.

కాగా ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తడబడింది. 10 ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. స్టార్క్ వేసిన నాలుగో ఓవర్లో 30 పరుగుల వద్ద శుభ్‌మన్‌ గిల్ (4) ఔటయ్యాడు. ఆ తర్వాత 9.4వ ఓవర్లో రోహిత్ శర్మ (47) ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ట్రావిస్‌ హెడ్‌ చేతికి చిక్కాడు. ఆ వెంటనే కమిన్స్‌ బౌలింగ్‌లో కీపర్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి శ్రేయస్‌ (4) పెవిలియన్‌కు చేరాడు. దీంతో 81 పరుగులకే టిమిండియా మూడో వికెట్లు నష్టపోయింది.


Tags:    

Similar News