IND vs AUS: టీమిండియా బౌలింగ్కు కంగారు పడ్డారు.. తక్కువ స్కోరుకే ఆలౌట్

Byline :  Bharath
Update: 2023-10-08 12:45 GMT

చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. టీమిండియా బౌలింగ్ దాటికి ఆసీస్ బ్యాటర్లు భయపడ్డారు. పరుగులు చేయడానికి కష్టపడ్డారు. స్పిన్, పేస్ బౌలింగ్ తో మన బౌలర్లు అటాక్ చేశారు. దీంతో ఆసీస్ 199 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో ఆలౌట్ అయింది. ముఖ్యంగా టీమిండియా స్పిన్ దళం.. జడేజా, కుల్దీప్ యాదవ్, అశ్విన్.. ఆసీస్ బౌలర్ల పనిపట్టారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ అడ్డుకున్నారు. పేస్ బౌలర్లు బుమ్రా, సిరాజ్, హార్దిక్ కూడా మరోవైపు నుంచి దాడి చేశారు. దీంతో ఆసీస్ పరుగులు చేయడం కష్టం అయింది.




 


వార్నర్, స్మిత్ తప్ప మిగిలిన ఏ ఆసీస్ బ్యాటర్ టీమిండియా దాడిని ఆపలేకపోయారు. ఓపెనర్ మిచెల్ మార్ష్ బుమ్రా బౌలింగ్ లో డకౌట్ అవ్వగా.. మరో ఓపెనర్ వార్నర్ (41), స్మిత్ (46)తో కలిసి స్కోర్ బోర్డ్ ను ముందుకు తీసుకెళ్లాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు లబుషేన్ (27), మ్యాక్స్ వెల్ (15) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. అలెక్స్ క్యారీ డకౌట్ అయ్యాడు. చివర్లో పాట్ కమ్మిన్స్ (15), స్టార్క్ (28) తలా ఓ చేయివేయడంతో ఆసీస్ 199 పరుగులు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్, బుమ్రా 2 వికెట్లతో సత్తా చాటారు. అశ్విన్, సిరాజ్, హార్దిక్ చెరో వికెట్ పడగొట్టారు.




 





 



Tags:    

Similar News