అమ్మాయిలు.. అదరహో.. మహిళల టెస్టు చరిత్రలో భారీ విజయం

Byline :  Bharath
Update: 2023-12-16 10:15 GMT

భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతం సృష్టించింది. ముంబై వేదికగా ఇంగ్లాండ్ మహిళా జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో సంచలన విజయం సాధించింది. కేవలం ఒకే ఒక సెషన్ లో ప్రత్యర్థి పది వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా.. 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహిళా టెస్ట్ క్రికెట్ జట్టులో అత్యంత భారీ విజయం సాధించిన జట్టుగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో 479 పరుగుల లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ జట్టు 131 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్ దీప్తి శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనంలో కీలక పాత్ర పోషించింది. మొత్తం 9 వికెట్లు పడగొట్టిన దీప్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. టీమిండియా ఓవర్ నైట్ స్కోర్ 186/6 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్ ఇచ్చింది. పూజా వస్త్రాకర్ 3 వికెట్లతో చెలరేగింది. రేణుకా సింగ్ 1, రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్ (21), ఆఖర్లో ఛార్లెట్ డీన్‌ (20) టాప్ స్కోరర్లు. మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో చెలరేగిన నాట్ స్కివెర్ బ్రంట్ రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ ఒక్క సెషన్ పూర్తి కాకుండానే చాపచుట్టేసింది. దీంతో మహిళల టెస్టు చరిత్రలో భారీ తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమ్‌ఇండియా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మహిళా క్రికెట్ లో 1998లో పాకిస్తాన్ 309 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును టీమిండియా అధిగమించింది. కాగా ఇంగ్లాండ్ ను ఓడించడం భారత్ కు ఇదే మొదటిసారి.

Tags:    

Similar News