Asian Games 2023: ఫైనల్లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్కు చుక్కలు చూపిస్తూ..
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏషియన్ గేమ్స్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 23న ప్రారంభం అయిన ఈ మెగా టోర్నీ.. రేపటితో (అక్టోబర్ 8) ముగియనుంది. కాగా ఏషియన్ గేమ్స్ లో మొదటిసారి ప్రవేశపెట్టిన పురుషుల క్రికెట్ పోటీల్లో ఫైనల్ చేరిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ కొంత ఆలస్యంగా మొదలైనా.. టీమిండియానే ఆధిపత్యం చెలాయిస్తుంది. భారత బౌలర్ల విజృంభనతో.. కేవలం 3 ఓవర్లలో ఆఫ్ఘన్ 3 వికెట్లు కోల్పోయింది. అర్ష్ దీప్ సింగ్, శివమ్ డూబె తలా ఓ వికెట్ తీసుకోగా.. మరొకరు (నూర్ అలి) రన్ ఔట్ అయ్యాడు. ఆఫ్ఘన్ బ్యాటర్లు జుబైద్ అక్బరీ 5, మహ్మద్ షాజాద్ 4, నూర్ అలి 1 పెవిలియన్ చేరారు. ప్రస్తుతం షహీదుల్లా 5, అఫ్జర్ జాజై 14 క్రీజులో ఉన్నారు.
తుది జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్(సి), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ(w), షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్‌దీప్ సింగ్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): జుబైద్ అక్బరీ, మహ్మద్ షాజాద్(w), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్(c), షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్