2024.. టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!

Byline :  Bharath
Update: 2024-01-01 04:49 GMT

క్రికెట్ అభిమానులకు 2023 సంవత్సరం ఓ పీడ కలగా మిగిలింది. అందులో ఘన విజయాలు ఉన్నా.. ఘోర పరాభవాలు కూడా టీమిండియా చవిచూసింది. అందులో వన్డే వరల్డ్ కప్, టెస్ట్ చాంపియన్షిప్ లు కూడా ఉన్నాయి. కాగా పరాభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. 2024లో వచ్చే సవాళ్లను ఎదుర్కునేందుకు సిద్ధం అయ్యాం. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా టీమిండియా సన్నద్ధం అవుతుంది. జట్టు కూర్పుపై ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలుపెట్టింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఒక మ్యాచ్ (రెండో టెస్ట్) మిగిలే ఉంది. ఆ టెస్ట్ జనవరి 3 నుంచి 7వ తేదీ వరకుర కేప్ టౌన్ వేదికగా జరగనుంది. ఇదిలా ఉండగా.. 2024లో టీమిండియా ఏయే సిరీసుల్లో.. ఎవరెవరితో తలపడనుందో పూర్తి షెడ్యూల్ పై ఓ లుక్కేద్దాం..

అఫ్గాన్‌తో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్:

జనవరి 11: తొలి టీ20 (మొహలీ)

జనవరి 14: రెండో టీ20 (ఇండోర్)

జనవరి 17: మూడో టీ20 (బెంగళూరు)

ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటన.. (5 టెస్టులు):

జనవరి: 25-29 తొలి టెస్టు (హైదరాబాద్‌)

ఫిబ్రవరి: 02-06 రెండో టెస్టు (విశాఖపట్నం)

ఫిబ్రవరి: 15-19 మూడో టెస్టు (రాజ్‌కోట్)

ఫిబ్రవరి: 23-27 నాలుగో టెస్టు (రాంచీ)

మార్చి: 07-11 ఐదో టెస్టు (ధర్మశాల)

ఏప్రిల్‌- మే నెలల్లో ఐపీఎల్‌:

జూన్‌ నెలలో టీ20 వరల్డ్ కప్‌:

జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.

బంగ్లాదేశ్‌తో సెప్టెంబరులో స్వదేశంలో రెండు టెస్టులు, మూడు టీ20ల్లో జరగనున్నాయి.

భారత్ వేదికగా అక్టోబర్‌లో న్యూజిలాండ్ తో మూడు టెస్టులు జరగనున్నాయి.

నవంబర్‌, డిసెంబర్ నెలల్లో ఆస్ట్రేలియా పర్యటన. అక్కడ ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది.




Tags:    

Similar News