అప్పుడు సచిన్ కోసం గెలిచాం.. ఇప్పుడు విరాట్ కోహ్లీ కోసం కప్పు గెలవాలి : సెహ్వాగ్

Update: 2023-06-27 14:05 GMT

ఈ ఏడాది స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ విరాట్ కోహ్లీకి చివరిదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు నిజమనేలా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో అభిమానుల్లో తీవ్ర ఆందోలన మొదలైంది. విరాట్ ఇప్పుడే తన క్రికెట్ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం టీంకు తన అవసరం చాలా ఉంది. అలాంటి టైంలో క్రికెట్ కు వీడ్కోలు పలకడం అనేది చర్చనీయాంశంగా మారింది. విరాట్ ఫిట్ నెస్ చూస్తుంటే.. మరో ఐదేళ్లు ఆడతాడని భావించిన అభిమానులకు సెహ్వాగ్ చేసిన కామెంట్స్ ను జీర్ణించుకోలేకపోతున్నారు.

2011లో సచిన్ కు వన్డే వరల్డ్ కప్ అందించి ఘనమైన వీడ్కోలు అందిచినట్లు.. విరాట్ కోహ్లీ కోసం కూడా ఈ టోర్నీలో గెలిచి చిరస్మరణీయ విజయాన్ని అందించాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ‘ విరాట్ టీమిండియా కోసం ఎంతో చేశాడు. గ్రౌండ్ లోకి దిగిన ప్రతిసారీ.. కోహ్లీ 100 శాతం ఎఫర్ట్ ఇచ్చాడు. ఈ వరల్డ్ కప్‌లో పిచ్‌లు కూడా కోహ్లీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. దాంతో అతను ఈ టోర్నీలో విజృంభించినా ఆశ్చర్యపోనవసరం లేదు. 2011లో మేమంతా సచిన్ కోసం వరల్డ్ కప్‌లో రాణించాం. ఎలాగైనా కప్పు అందిచాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు టీమిండియా కూడా అదే చేయాలి. అదే విరాట్ కు ఇచ్చే గౌరవం అవుతుంది. అందరూ కూడా అతని కోసం వరల్డ్ కప్ గెలవాలని ఆడాల’ని అని సెహ్వాగ్ భారత జట్టును కోరాడు.

ప్రస్తుతం విరాట్ వెస్టిండీస్ టూర్ కు సిద్ధం అవుతున్నాడు. ఈ సిరీస్ తర్వాత ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి రెండు మెగా టోర్నీలు ఆడాలి. వీటిలో పర్ఫామెన్స్ బట్టి టీమిండియా భవిష్యత్తు, విరాట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే, గత పదేళ్లలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. ప్రస్తుతం సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీలో అయినా గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

https://www.instagram.com/p/Ct_EI1FtOZU/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

Tags:    

Similar News