ఐర్లాండ్‌‌తో నేడే చివరి టీ20...అందరి చూపు అతడిపైనే

Update: 2023-08-23 09:36 GMT

ఐర్లాండ్‌తో తుదిపోరుకు భారత్ సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించి సిరీస్ దక్కించుకుంది. ఇక మూడో మ్యాచ్‌లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరవైపు చివరి మ్యాచ్‌లో నైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఐర్లాండ్ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా రిజర్వ్ ఆటగాలను ఆడించే అవకాశం ఉంది. రెండు టీ20ల్లో బరిలో దిగని అవేష్ ఖాన్, జితేశ శర్మ, షాబాజ్ అహ్మద్‌లు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్షదీప్ స్థానంలో అవేష్ ఖాన్, సంజూశాంసన్ స్థానంలో జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్ లు బరిలోకి దిగొచ్చు.

ఆరంగ్రేటంలోనే 21 బంతుల్లో 38 పరుగులు చేసిన రింకూ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడన్నదానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెస్టిండీస్ పై రాణించి ఐర్లాండ్ టూర్ లో విఫలమవుతున్న తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌కు పనిచెప్పాల్సి ఉంది. పునరాగమనం తర్వాత బుమ్రా, ప్రసిధ్ కృష్ణ మంచి ప్రదర్శన కనబర్చడం టీడిండియాకు శుభపరిణామం.

మూడవ టీ20 డబ్లిన్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు నమోదు చేయడం ఖాయం. మ్యాచ్ కు వర్షం కాసేపు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

Tags:    

Similar News