World Cup 2023: తొలి మ్యాచ్లో విధ్వంసం.. రోహిత్ రికార్డ్ బ్రేక్

By :  Bharath
Update: 2023-10-28 11:05 GMT

భీకర ఫామ్ తో.. వరల్డ్ కప్ లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న జట్టుతో కీలక మ్యాచ్. గాయం కారణంగా మొదటి ఐదు మ్యాచ్ లకు దూరం. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఓపెనర్ గా ఛాన్స్. వరల్డ్ కప్ డెబ్యూ.. ఓ ప్లేయర్ కు గేమ్ లో ఉండాల్సిన ఒత్తిడంతా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ పై ఉంది. కానీ వాటన్నింటినీ పక్కనబెట్టి.. విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ తో కలిసి భారీ స్కోర్ కు పునాది వేశాడు. వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో సెంచరీ చేసి.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డ్ ను చెరిపేశాడు. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా కివీస్ బౌలర్లను ఉతికి ఆరేసి సూపర్ సెంచరీ చేశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కివీస్ కు బజ్ బాల్ రుచి చూపించింది. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకు పడి 388 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 67 బంతుల్లో 7 సిక్సర్లు, 10 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డ్ ను తిరగరాశాడు. వరల్డ్ కప్ డెబ్యూ మ్యాచ్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసిన హెడ్.. 59 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. గతంలో రోహిత్ శర్మ.. ఆఫ్ఘనిస్తాన్ పై 63 బంతుల్లో 100 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్ లో 67 బంతులు ఆడిన హెడ్ 109 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

Tags:    

Similar News