IPL Auction 2024 : కొనసాగుతున్న వేలం.. హెడ్‌ను దక్కించుకున్న సన్రైజర్స్

Byline :  Krishna
Update: 2023-12-19 08:43 GMT

ఐపీఎల్ మినీ వేలం ప్రారంభమైంది.12 దేశాలకు చెందిన 333 మంది ఆటగాళ్లు వేలంలో అందుబాటులో ఉన్నారు. ఆసీస్ టాప్ క్రికెటర్ ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్ దక్కించుకుంది. అతడి బేస్ ప్రైజ్ 2 కోట్లు కాగా.. పోటీ 6.80కోట్లకు ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. హెడ్ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పోటీపడగా..చివరకు హైదరాబాద్ సొంతం చేసుకుంది. అదేవిధంగా శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగను 1.5కోట్లకు సొంతం చేసుకుంది. వెస్టిండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. అతడి బేస్ ధర కోటి రూపాయలు కాగా.. ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ 7.40 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ను ఢిల్లీ క్యాపిటల్స్ 4కోట్లకు దక్కించుకుంది. మరికొందరు ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్, కరుణ్ నాయర్ లను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.


Tags:    

Similar News