మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోయే ఆసియా కప్2023కు సర్వం సిద్ధం అయింది. ప్రతీ జట్టు ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కోచ్లు తమ కెప్టెన్లతో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ బ్యాడ్ న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. ఆసియా కప్ కు ఎంపికైన శ్రీలంక ఆటగాళ్లు అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరాకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన శ్రీలంక యాజమాన్యం మిగతా ప్లేయర్లకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ ఇద్దరు ఆటగాల్లు ఇటీవల జరిగిన శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో లీగ్ లో వీరితో సన్నిహితంగా ఉన్న మరికొందరిపై అనుమానాలు మొదల్యయాయి. దీంతో ఆసియా కప్ లో పాల్గొనే శ్రీలంక జట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ ప్లేయర్ వాహిండు హసరంగ గాయ కారణంగా టోర్నీకి దూరం అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు కరోనా రావడంపై ఆ జట్టును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
🚨Breaking News! Kusal Perera and Avishka Fernando tested positive for COVID-19 ahead of #AsiaCup2023 pic.twitter.com/mGhDPze8D3
— Cricket Winner (@cricketwinner_) August 25, 2023