క్రికెట్ చరిత్రలో మరో సంచలనం.. పసికూన చేతిలో చిత్తైన న్యూజిలాండ్

Update: 2023-08-20 12:18 GMT

చిన్న దేశాలతో మ్యాచ్ అంటే.. అగ్రశ్రేణి జట్లకు ఎప్పుడూ చిన్న చూపే. ఎలాగూ విజయం తమదే అన్న ధీమాతో బీ టీంను బరిలోకి దింపుతారు. అలాంటి పనే న్యూజిలాండ్ చేసింది. ఇప్పుడు దానికి ఫలితం మూట గట్టుకుంది. ప్రపంచ క్రికెట్ లో పరువు పోగొట్టుకుంది. దుబాయ్ వేదికగా యూఏఈ జట్టుతో టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోయిన యూఏఈ.. రెండో మ్యాచ్ లో పట్టు బిగించి కివీస్ కు ఓటమి రుచి చూపించింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ పై యూఏఈ చరిత్రలో తొలి విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన కివీస్.. యూఏఈ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో చాప్ మన్ (63) మినహా మిగతావాళ్లంతా దారుణంగా విఫలం అయ్యారు. యూఏఈ బౌలర్లలో ఆయాన్‌ ఖాన్‌ 3 వికెట్లు తీసుకోగా.. జవదుల్లా 2, నసీర్‌, మహ్మద్‌ ఫరాజుద్దీన్ చెరో వికెట్‌ సాధించారు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 26 బాల్స్ మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. కెప్టెన్‌ మహ్మద్‌ వసీం (55; 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. ఆసీఫ్‌ ఖాన్‌ (48 నాటౌట్‌) పరుగులతో చేశాడు. కివీస్‌ బౌలర్లలో సౌథీ, శాంట్నర్‌, జేమీసన్ తలా వికెట్‌ తీసుకున్నారు.


Tags:    

Similar News