IPL Auction 2024: అన్క్యాప్డ్ ప్లేయర్లపై కాసుల వర్షం.. ఇంతకీ ఎవరు వీళ్లు?
ఐపీఎల్ 2024 వేలంలో అన్ క్యాప్డ్ ప్లేయర్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ యువ ఆటగాడు, అన్ క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ భారీ ధర పలికాడు. రూ.20 లక్షల బేస్ ప్రైజ్ తో వచ్చిన రిజ్వీని చైన్నై.. రూ. 8.4 కోట్లకు దక్కించుకుంది. రిజ్వీ కోసం గుజరాత్, చెన్నై పోటీ పడ్డాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో అనక్యాప్‌డ్ ప్లేయర్‌గా రిజ్వీ రికార్డుకెక్కాడు.
మరో అన్ క్యాప్డ్ ప్లేయర్.. శుభమ్ దూబెను రాజస్థాన్ సొంత చేసుకుంది. రూ. 20 లక్షల బేస్ ధరకు వచ్చిన దూబెని రాజస్థాన్ రూ. 5.8 కోట్లకు సొంత చేసుకుంది. దూబెకోసం చివరి వరకు ఢిల్లీ, రాజస్థాన్ పోటీ పడ్డాయి. గతంలో టీమిండియా బౌలర్ ఆవేశ్ ఖాన్ అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రూ.10 కోట్లు పలికాడు. మరో అన్ క్యాప్డ్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీని బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలకు కోల్ కతా సొంతం చేసుకుంది.