SA vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్.. జట్టులో మార్పుచేసిన సౌతాఫ్రికా

Byline :  Bharath
Update: 2023-11-10 08:29 GMT

ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచే మ్యాచ్ ఇది. అయితే సౌతాఫ్రికాపై భారీ తేడాతో గెలిస్తేనే ఆఫ్ఘన్ సెమీస్ రేసులో నిలుస్తుంది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో సౌతాఫ్రికాకు చేజింగ్ లో పెద్దగా రికార్డులు లేవు. నెదర్లాండ్స్, టీమిండియా చేతిలో భారీ తేడాతో ఓడిపోయింది. దాంతో బౌలింగ్ బలంగా ఉన్న ఆఫ్ఘన్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. టీంలో రెండు మార్పులు చేసింది. ఆండిలే ఫెహ్లుక్వాయో,గెరాల్డ్ కోయెట్జీ జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు:

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్ (w), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (w), టెంబా బావుమా (సి), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డేవిడ్ మిల్లర్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి




Tags:    

Similar News