World cup 2023: బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..సెమీస్ రేస్ నుంచి పాకిస్తాన్ ఔట్
మ్యాచ్ కు ముందు ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్.. ప్రిడిక్షన్స్ అన్నీ ఓకే అయితే ఎలాగైనా సెమీస్ కు వెళ్తామని పట్టదలతో ఉంది. కాగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. అంతా తారుమారైంది. మ్యాచ్ జరగకముందే పాక్ సెమీస్ ఆశలపై ఇంగ్లాండ్ నీళ్లు చల్లింది. పాక్ సెమీస్ చేరాలంటే.. ఆ జట్టే తప్పకుండా టాస్ గెలవాలి. తర్వాత ఇంగ్లాండ్ కు భారీ టార్గెట్ ఇచ్చి.. తక్కువ పరుగులకే కట్టడి చేయాలి. ఇన్ని ప్రిడిక్షన్స్ పెట్టుకున్న పాక్ ఆశలపై ఇంగ్లాండ్ నీళ్లు చల్లింది.
తుది జట్లు:
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(w/c), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(c), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం జూనియర్, హరీస్ రవూఫ్