Under-19 World Cup : అండర్-19 వరల్డ్ కప్ : బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

Update: 2024-01-21 01:17 GMT

సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ శుభారంభం చేసింది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో యంగ్‌ఇండియా 84 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్‌ బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. బ్లూంఫోంటీన్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత కుర్రాళ్ల నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన బంగ్లాదేశ్ ను 45.5 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూల్చింది. భారత బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో రాణించాడు. ముషీర్ ఖాన్ 2, రాజ్ లింబానీ 1, అర్షిన్ కులకర్ణి 1, ప్రియాన్షు మోలియా 1 వికెట్ తీశారు. ఆదర్శ్‌సింగ్‌ (76), కెప్టెన్‌ ఉదయ్‌ శరణ్‌ (64) అర్ధశతకాలతో రాణించారు. తెలంగాణ కుర్రాడు అరవెల్లి అవనీశ్‌రావు (23; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌) వేగంగా ఆడాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అవనీశ్‌ అదుర్స్‌ అనిపించాడు. బంగ్లా బౌలర్లలో మారూఫ్‌ 5 వికెట్లు తీశాడు. ఛేదనలో బంగ్లాదేశ్‌ 167 పరుగులకు ఆలౌటైంది. షిహాబ్‌ (54) టాప్‌ స్కోరర్‌ కాగా.. మన బౌలర్లలో పాండే 4 వికెట్లు తీశాడు. ఆదర్శ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.




 




Tags:    

Similar News